Delhi: “ఒకే దేశం-ఒకే ఎన్నిక” (One Nation One Election) బిల్లును దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన కీలక చర్చనీయాంశమైంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరో బిల్లును కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభ ముందు ఉంచారు.
1. ఉమ్మడి కమిటీ:
బిల్లులపై విస్తృత చర్చలు జరిపేందుకు పార్లమెంటు ఉభయసభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేశారు. కమిటీలో పార్టీ బలాబలాలను బట్టి సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. కమిటీకి చైర్మన్ బీజేపీ నుండి ఉండనున్నారు. కమిటీకి ప్రాథమికంగా 90 రోజుల కాలపరిమితి విధించారు. అవసరమైతే ఈ గడువు పొడిగించవచ్చు.
2. రాజకీయ పార్టీల మద్దతు:
రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రకారం, 32 రాజకీయ పార్టీలు ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు ఇవ్వగా, 15 పార్టీలు వ్యతిరేకించాయి.
3. ప్రతిపాదన లక్ష్యం:
దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరపడం ద్వారా ఎన్నికల నిర్వహణ ఖర్చులను తగ్గించడం, పాలన సజావుగా జరగడం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొనబడింది. ఈ బిల్లుపై ఇప్పట్లో రాజకీయ పార్టీల మధ్య వాదప్రతివాదాలు మరింత ఊపందుకోనున్నాయి.