Census:దేశవ్యాప్త జనగణనకు రంగం సిద్ధమైంది. 2027 జనగణన నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఆ గెజిట్ నోటిపికేషన్‌ను విడుదల చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండు దశల్లో జనగణన చేపడుతారు. మొదటి దశలో ఇళ్ల వివరాలు, తర్వాత దశలో జనాభా తెక్కింపు చేపడుతారు. ఈసారి జనాభా లెక్కల్లో కులాల సమాచారం కూడా సేకరించనున్నారు. డిజిటల్ రూపంలో వ్యక్తిగత సమాచారం వివరాలను కూడా సేకరిస్తారు.
