Railway DRM: విశాఖపట్నంలోని వాల్టెయిర్ డివిజన్‌కు చెందిన డిఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్‌ను అవినీతి ఆరోపణలపై సిబిఐ అరెస్టు చేసింది. ముంబై కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేసి తీసుకున్నట్లు సౌరభ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇచ్చిన వ్యక్తిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.
మెకానికల్ బ్రాంచ్‌కు సంబంధించిన టెండర్‌కు సంబంధించి కాంట్రాక్టర్ నుండి డీఆర్‌ఎం రూ.25 లక్షలు డిమాండ్ చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. లంచం తీసుకునేందుకు ముంబైకి చేరుకోగా, ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు అతడిని పట్టుకున్నారు. అరెస్టు అనంతరం విశాఖపట్నంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన..?
Railway DRM: విశాఖపట్నం డివిజన్ డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ 1991 బ్యాచ్ మెకానికల్ ఇంజినీరింగ్ అధికారి. ఏడాది క్రితం విశాఖపట్నంలో డీఆర్‌ఎంగా నియమితులయ్యారు. ఆయన అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు ఉదయం సీబీఐ ప్రత్యేకంగా వెల్లడించనుంది. గతంలో అంటే జులైలో ఐదుగురు రైల్వే అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది. అవినీతి ఆరోపణలపై ఈ ఐదుగురు సీనియర్ రైల్వే అధికారులను సీబీఐ అరెస్టు చేసిన సమయంలోనూ ఇదే తరహా కేసు వెలుగులోకి వచ్చింది. వీరిలో గుంతకల్ డివిజన్‌కు చెందిన డిఆర్‌ఎం వినీత్ సింగ్ కూడా ఉన్నారు.
గుంతకల్ రైల్వే డివిజన్‌లో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలను బయటపెట్టేందుకు సీబీఐ ఈ ఆపరేషన్ చేపట్టింది. విచారణలో కొంతమంది నిందితుల ఇళ్లలో సీబీఐ బృందాలు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నాయి. వినీత్ సింగ్ నివాసంలో సుమారు రూ.7 లక్షలు, మరో ముగ్గురి నుంచి రూ.11 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.