Shubman Gill: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గిల్ (154), ఇషాన్ కిషన్ (125) రాణించడంతో భారత్ 402 పరుగులు చేసింది. వన్డేల్లో 8వ సారి 400+ స్కోరు చేసి సౌతాఫ్రికా రికార్డును భారత్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో గిల్ వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసి, అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్‌ల్లో) ఈ మైలురాయిని దాటిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే బంతుల పరంగా కపిల్ దేవ్ రికార్డును 21 బంతుల తేడాతో మిస్ చేసుకున్నాడు.
మరింత Shubman Gill: కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్!Category: News
ED Arrest: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ!
ED Arrest: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం (AP Liquor Transport Scant) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (ED) కీలక చర్య తీసుకుంది.
మరింత ED Arrest: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ!Adulterated Paneer: 825 కిలోల కల్తీ పనీర్ సీజ్.. గంజిపొడి, సింథటిక్ పాలతో దందా!
Adulterated Paneer: హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా 45 ఫుడ్ ఔట్‌లెట్లు, 8 పనీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేసి 825 కిలోల కల్తీ పనీర్, నకిలీ చీజ్ సీజ్ చేశారు. సింథటిక్ పాలు, గంజిపొడి, జంతువుల కొవ్వుతో ఈ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేని నిందితులపై కేసులు నమోదు కాగా, తనిఖీలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.
మరింత Adulterated Paneer: 825 కిలోల కల్తీ పనీర్ సీజ్.. గంజిపొడి, సింథటిక్ పాలతో దందా!Sai Krishna: కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్.. రంగంలోకి ఐపీఎస్ అధికారి!
Sai Krishna: విజయవాడకు చెందిన సాయికృష్ణ మిస్సింగ్ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిపిన సమీక్ష అనంతరం కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేశారు. పోలీసులే తన కొడుకును చంపేశారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తూ, పీఎస్ సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఈ కేసు విచారణను ఐపీఎస్ అధికారి, రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌కు అప్పగించింది.
మరింత Sai Krishna: కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్.. రంగంలోకి ఐపీఎస్ అధికారి!Mumbai లో నీటి ముప్పు.. ఎండిపోతున్న సరస్సులు.. మరో 40 రోజులకు మాత్రమే సరిపోయే నీరు!
Mumbai: ముంబైలో ఈ ఏడాది వర్షాకాలం ఆలస్యమవడంతో నీటి ముప్పు పొంచి ఉంది. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సులలో కేవలం 10.72 శాతం నీరు మాత్రమే ఉంది. ఈ నీటి నిల్వలు మరో 40 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెప్తున్నారు. జూన్ 20 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మరింత Mumbai లో నీటి ముప్పు.. ఎండిపోతున్న సరస్సులు.. మరో 40 రోజులకు మాత్రమే సరిపోయే నీరు!Harish Rao: కాంగ్రెస్ మార్క్ మోసం ప్రజలకు అర్థమైంది..!
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, ప్రస్తుతం జనాలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు, పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందన్న బీఆర్ఎస్ వినతిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సానుకూలంగా స్పందించిందని, ప్రభావిత ప్రాంతాలకు రక్షణ చర్యలు లేదా ఆర్‌అండ్‌ఆర్ కింద నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిందని హరీష్ రావు వెల్లడించారు.
మరింత Harish Rao: కాంగ్రెస్ మార్క్ మోసం ప్రజలకు అర్థమైంది..!Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: అరుదైన ‘డ్యూచెన్ మస్кулярర్ డిస్ట్రోఫీ’ వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలోని ఆయన నివాసానికి స్వయంగా వచ్చి 40 నిమిషాలు గడిపారు. బాబు వైద్య ఖర్చులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించడంతో పాటు శ్రీవారి శేషవస్త్రంతో ఆశీర్వదించారు. ఆ కుటుంబం కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన నేతలను ఆదేశించిన పవన్, అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
మరింత Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!
Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. విద్యాశాఖకు ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్తూ.. కులాల వారీగా హాస్టళ్ల కంటే అందరూ కలిసి చదివే టీపీఎస్ విధానమే సరైందని పేర్కొన్నారు. 1800 మందితో ఆరుట్ల స్కూల్ ‘నో వేకెన్సీ’ స్థాయికి చేరిందని, 2034 నాటికి ఇక్కడి పిల్లలు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించేలా ట్రైనింగ్ ఇస్తామన్నారు. అలాగే ఉప్పల్ స్టేడియం టెండర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు.
మరింత Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!Pawan Kalyan: ‘చోటా గబ్బర్ సింగ్’ ఇంటికి వచ్చి పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan: అరుదైన ‘డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ’ వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలోని ఆయన నివాసానికి స్వయంగా వచ్చారు. సామాజిక కార్యకర్త చిలువేరు శంకర్ ద్వారా బాబు పరిస్థితి తెలుసుకున్న పవన్.. నిరంజన్ ఇంట 45 నిమిషాలు గడిపి, ధైర్యం చెప్పారు. పవన్ రాకతో ఆ బాలుడి చివరి కోరిక నెరవేరింది.
మరింత Pawan Kalyan: ‘చోటా గబ్బర్ సింగ్’ ఇంటికి వచ్చి పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎంTelangana Public School: మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.15 కోట్లతో అంతర్జాతీయ హంగులు!
Telangana Public School: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్రంలోనే మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించారు. రూ.15 కోట్ల ప్రభుత్వ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాసేపట్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
మరింత Telangana Public School: మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.15 కోట్లతో అంతర్జాతీయ హంగులు!