AMARAVATI: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు

AMARAVATI: వైసీపీ నేత, మాజీ మంత్రి **కారుమూరి నాగేశ్వరరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో, ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదం రేపాయి. “కూటమి నేతలను నరుకుతామంటూ”, “గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతామని” అంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఏలూరులో జరిగిన వైసీపీ సమావేశంలో కారుమూరి మాట్లాడుతూ:

– “కూటమి నేతలను నరుకుతాం”
– “గుంటూరు ఇవతల వాళ్లను ఇళ్లలో నుంచి లాగి కొడతాం”
– “అవతల వాళ్లను నరికిపారేస్తాం”

అని వ్యాఖ్యానించారు. అలాగే, “నేను పెద్దిరెడ్డి దగ్గరకు వెళ్లాను. కూటమి ఏం చేసినా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు” అని చెప్పారు.  టీడీపీ నేతలు తమపై కక్ష పెట్టొద్దని అడుగుతున్నారని, కానీ అది జరగదని ఆయన స్పష్టం చేశారు.

టీడీపీ నేతల ఫిర్యాదు

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై గుంటూరులోని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యానీ, అడకా శ్రీను కలిసి  నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు  చేశారు. వారి ఫిర్యాదు మేరకు, కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.

పోలీసుల నోటీసులు

ఈ కేసుకు సంబంధించి, కారుమూరిని విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. అతని వ్యాఖ్యలను మరింతగా పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *