Indian Student Visa

Indian Student Visa: కెనడాలో భారతీయ విద్యార్థులకు షాక్

Indian Student Visa: కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశం భారీ షాకిచ్చింది. కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, భారతీయ విద్యార్థుల స్టడీ వీసా దరఖాస్తుల్లో సుమారు 74 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2023 ఆగస్టులో కేవలం 32 శాతంగా ఉన్న తిరస్కరణ రేటు, 2025 ఆగస్టు నాటికి 74 శాతానికి చేరింది. అంటే, కెనడాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురు భారతీయ విద్యార్థుల్లో ముగ్గురి వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇదే సమయంలో, ఇతర దేశాల విద్యార్థుల మొత్తం తిరస్కరణ రేటు 40 శాతంగా ఉంది. భారత విద్యార్థులకు ఈ స్థాయిలో తిరస్కరణ రేటు ఉండడం రికార్డు.

కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల వీసాలపై ఆంక్షలను కఠినతరం చేయడానికి ప్రధానంగా రెండు కారణాలను చూపుతోంది: నకిలీ అడ్మిషన్ లెటర్లు, ఆర్థిక పత్రాల మోసాలు పెరగడం. 2023లో దాదాపు 1,550 ఫేక్ లెటర్లను కెనడా గుర్తించగా, వీటిలో అత్యధికం భారతదేశం నుంచే ఉన్నట్లు సమాచారం. దీంతో వీసా దరఖాస్తుల పరిశీలనను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. తాత్కాలిక వలసదారుల సంఖ్యను తగ్గించాలని, దేశంలో పెరుగుతున్న గృహాల కొరత, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Ravichandran Ashwin: బిగ్ బాష్ లీగ్ అరంగేట్రానికి బ్రేక్.. మోకాలి గాయంతో తప్పుకున్న అశ్విన్

వీసా తిరస్కరణ రేటు పెరగడంతో పాటు, కెనడాకు దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2023 ఆగస్టులో 20,900 దరఖాస్తులు రాగా, 2025 ఆగస్టులో అది కేవలం 4,515కి పడిపోయింది. భారత విద్యార్థులు నాణ్యమైన అభ్యర్థులని, వారి ప్రతిభ కెనడియన్ సంస్థలకు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుందని ఢిల్లీలోని కెనడియన్ ఎంబసీకి భారతీయ అధికారులు గుర్తు చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *