Coffee

Coffee: కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందా..? షాకింగ్ సర్వే..

Coffee: ఉదయం ఒక్క కప్పు కాఫీ పడితే శరీరం యాక్టివ్ అయిపోతుంది. అప్పటివరకు ఉన్న నిద్ర మత్తు అంతా వదులుతుంది. మార్నింగ్ కప్పు కాఫీ లేకపోతే ఆ డే మొత్తం నీరసంగా అనిపిస్తుంది. అయితే కాఫీ తాగేవారికి ఓ సర్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాఫీ మనిషి ఆయుష్షును పెంచుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

కాఫీ మగత కలిగించే అడెనోసిన్‌ను నిరోధించి..ఏకాగ్రతను పెంచుతుంది. శారీరక శ్రమకు ఆజ్యం పోసే అడ్రినలిన్ విడుదలను కాఫీ ప్రేరేపిస్తుంది. కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడి, వాపును తగ్గిస్తాయి.

కాఫీ ఎలా పని చేస్తుంది..?
రోజూ కాఫీ తీసుకోవడం వల్ల మన జీవితకాలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులపై నిర్వహించిన పరిశోధనలో ఆరోగ్యవంతమైన వ్యక్తుల శాతం 2022లో 10శాతం నుండి 2050 నాటికి 16శాతానికి పెరుగుతోందని తేలింది. తక్కువ మోతాదులో కాఫీ తాగడం ఆరోగ్యకరమైన, సమతుల్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ అధ్యయనం చెబుతోంది.

కాఫీ ఉపయోగాలు
కాఫీ ఆయుష్షును పెంచడంతో పాటు హెల్తీగా ఉంచుతుంది. తక్కువ మోతాదులో కాఫీ వినియోగం టైప్ 2 డయాబెటిస్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కాఫీలోని కెఫిన్ కంటెంట్ దృష్టిని పెంచుతుంది. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు మన కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి అదేవిధంగా కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: Health Tips: చలికాలంలో వేడినీరు తాగుతున్నారా..? అయితే జాగ్రత్తా..

Coffee: జీవ వృద్ధాప్యం
రెగ్యులర్ గా కాఫీ తాగడం వల్ల మసలితనం లేట్ గా వస్తుంది. వృద్ధాప్యానికి కారణమయ్యే సాధారణ సెల్యులార్ పనితీరును మెరుగుపరుస్తుంది.

శారీరక పనితీరు
కాఫీ మన శారీరక పనితీరును మెరుగుపరుస్తుంది. వ్యాయామానికి ముందు కాఫీ తాగడం మరింత శక్తినిస్తుంది.

మానసిక స్థితి, శక్తి
కాఫీలోని కెఫిన్ కంటెంట్ మెదడులోని డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల మానసిక స్థితి బాగుంటుంది.

మితిమీరితే ప్రమాదం
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అయితే అమృతం మితిమీరితే విషం అన్న సామెతలానే కాఫీని అతిగా తీసుకోవడం కూడా ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి కాఫీని రెగ్యులర్ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *