Bus Accident: తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరగడంతో అదుపుతప్పి ముందున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఆ తర్వాత రోడ్డుపక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది.
ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న కంకిపాడుకు చెందిన సత్యనారాయణ (52) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు ఆయనను తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Breaking: ఏపీ హైకోర్టు: గ్రూప్-2 పరీక్షలపై మధ్యంతర ఆదేశాలు
ప్రమాదం జరిగిన విధానం స్థానికులను షాక్‌కు గురి చేసింది. బస్సులో ఉన్న ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో తప్పించుకున్నారని సమాచారం. ప్రమాదం కారణంగా రహదారిపై ఒకసారి గందరగోళం నెలకొంది.
స్టీరింగ్ రాడ్ విరిగిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.