Ranbir Kapoor: యానిమల్ మూవీతో రణ్‌బీర్ కపూర్ టాలీవుడ్ ఫేవరేట్ బాలీవుడ్ హీరోగా మారాడు. అయితే రణ్‌బీర్ కపూర్ న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న రోజుల్లో, ఆయన తండ్రి రిషి కపూర్ అతనికి రోజుకు కేవలం 4 డాలర్ల బడ్జెట్‌ను మాత్రమే ఖర్చులకు ఇచ్చేవారట. అయితే ఈ కఠిన ఆర్థిక క్రమశిక్షణ రణ్‌బీర్‌కు డబ్బు విలువ తెలిపిందని ఆయన తెలిపారు. తండ్రి కఠినత్వం వెనుక ప్రేమ, బాధ్యత ఉన్నాయని రణ్‌బీర్ తర్వాత అర్థం చేసుకున్నారట. ఈ అనుభవం అతని జీవితంలో ఓ మధుర గుర్తుగా మిగిలిందని తెలిపారు.
