Peddapalli: ఈ మధ్య అక్రమ సంబంధాలు హత్యలకు గురి చేస్తున్నాయి.. ఇద్దరు దోస్తులు.. ఒకడు ఇంకోక్కడ్ని అతి దారుణంగా హత్యా చేసాడు.. ఎందుకో తెలుసాయ..? ఒక అమ్మాయి కోసం.. కానీ దారిద్రానికి దొరికిపోయాడు.. ఆ అమ్మాయిని కూడా పట్టించేసాడు.. హత్యా చేసింది నిజంగా అమ్మాయి కోసమేనా ..?
పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్య జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ ను ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ కత్తితో మెడపై పొడిచి దారుణంగా హత్య చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడితో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు.

