Bandi Sanjay

Bandi Sanjay: BRSను కాపాడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. బండి సంజయ్‌ సంచలన ట్వీట్‌

Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి బహిర్గతమైన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్రమంత్రి బండి సంజయ్‌ బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ ఎప్పటి నుంచో చెబుతున్నదే నిజమని రుజువైందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి బాధ్యత వహించాలి

బండి సంజయ్  ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, వైఫల్యాలకు పూర్తిస్థాయిలో బీఆర్‌ఎస్‌ బాధ్యత వహించాలి అని అయన అన్నారు. మేము ముందే సీబీఐ విచారణ కోరాం కానీ కాంగ్రెస్ అప్పట్లో బీఆర్‌ఎస్‌ను కాపాడింది. కానీ నిజం ని ఎక్కువ రోజులు ఆపలేరు అని ఇప్పుడు నిజం వెలుగులోకి వచ్చింది అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: 2029లో రాహుల్ ప్రధాని కావడం ఖాయం.. బీఆర్ఎస్-BJP గుట్టు విప్పిన రేవంత్

ORR టోల్ టెండర్లు, SIT‌పై ప్రశ్నలు

బండి సంజయ్ హైదరాబాద్ ORR టోల్ టెండర్లపై SIT విచారణను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు SIT‌ను నియమించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతుందన్నారు. ప్రకటనలతో మాత్రమే సమస్యలు పరిష్కరించలేం. తక్షణమే SIT ఏర్పాటు చేసి నిజానిజాలు బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి చెపుతూ బండి సంజయ్, “ఈ కేసు ఎప్పటికీ ముగియని డైలీ సీరియల్‌లా కొనసాగుతోంది అని. ప్రజలు నిజం తెలుసుకోవాలి. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన ఈ అవకతవకలన్నీ బయటపడాలి అని అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *