BRS: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై విచారణ కోసం వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ)ని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. హెచ్‌సీయూ భూముల్లో అక్రమంగా చెట్ల కొట్టివేతపై సుమారు 200 పేజీలతో కూడిన నివేదికను ఇవ్వనున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) ముందుగా యూనివర్సిటీలో పర్యటించనున్నది.
BRS: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) మొదట చర్చించనున్నది. అదే విధంగా అధ్యాపక బృందంతో సమాచారం సేకరిస్తారు. సాయంత్రం ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసేందుకు వెళ్లింది.
BRS: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో సీఈసీ సభ్యులను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసేందుకు వెళ్లింది. వారిలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్రసాద్ కలిశారు. అనంతరం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.