Pune

Pune: మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన

Pune: మహారాష్ట్ర పుణే జిల్లాలో ఆదివారం ఘోర ఘటన చోటు చేసుకున్నది. పింప్రి-చించ్వాడ్‌ పీఎస్‌ పరిధిలోని కుందమలలో ఇంద్రయాణి నదిపై వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లుగా స్థానిక ఎమ్మెల్యే సునీల్‌ షుల్కే తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం గల్లంతయ్య వారి కోసం గాలిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన కుందమలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇంద్రయాని నదిని దాటేందుకు వంతెనను నిర్మించారు. ఇటీవల రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వంతెన దెబ్బతిన్నట్లుగా తెలుస్తున్నది.

ఈ వంతెన కూలిపోవడంతో పర్యాటకులు నదిలో పడి కొట్టుకుపోయారు. ప్రస్తుతం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురిని సహాయ సిబ్బంది రక్షించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వంతెన కూలడంతో ఎంత మంది కొట్టుకుపోయారన్న విషయంలో స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, 20-25 మంది వరకు గల్లంతై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే సునీల్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆరుగురు మరణించారన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అంబులెన్స్‌లను సంఘటనా స్థలంలో మోహరించామని.. పర్యాటకులను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kerala: ఆలయంలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి.. 30మందికి గాయాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *