Breaking News: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. అక్కడి కామన్ సెంట్రల్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ జనపథ్ రోడ్డులోని ఈ భవనంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి 13 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే పనిలో పడ్డారు. ప్రమాద కారణాలు, నష్టం గురించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉన్నది.

