Breaking News: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ వద్ద జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలైన ఘటనను మరువక ముందే శుక్రవారం (నవంబర్ 21) అదే రోడ్డుపై మరో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. బీజాపూర్-హైదరాబాద్ హైవేపై చేవెళ్ల పట్టణానికి సమీపంలోని మొయినాబాద్ కనకమామిడి మధ్యలో ఈ ప్రమాదం జరిగింది.
Breaking News: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఇంకో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Breaking News: ఇదే బీజాపూర్-హైదరాబాద్ హైవేపైన ఇదే నెల 2వ తేదీన ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్ ఢీకొని ఘోర దుర్ఘటన చోటుచేసుకన్నది. ఈ ప్రమాదంలో బస్సు తీవ్రంగా ధ్వంసమై, ఒకవైపు కోసుకుపోయింది. బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులపై ఉన్న ఫలంగా కంకర టిప్పర్ పడటంతో ఊపిరాడక, తీవ్ర గాయాలతో 19 మంది చనిపోయారు. ఈ ఘటనను మరువక ముందే మరో ప్రమాదం అదే రోడ్డులో జరగడంతో ఆ ప్రాంతంలో నిత్యం వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

