Kalyan Krishna

Kalyan Krishna: కళ్యాణ్ కృష్ణ ఏం చేస్తున్నాడు!?

Kalyan Krishna: తొలి చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’తోనే దర్శకునిగా తనదైన బాణీ పలికించారు కళ్యాణ్ కృష్ణ. ఆ తరువాత నాగచైతన్య హీరోగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’తోనూ ప్రేక్షకుల మన్ననలు పొందారు… మూడో సినిమా ‘నేల టిక్కెట్టు’తో హ్యాట్రిక్ కొడతారేమో అనుకుంటే ఆ సినిమా నిరాశ పరచింది. ఆ తరువాత ‘సోగ్గాడే చిన్నినాయనా’కు కొనసాగింపుగా నాగార్జున, నాగచైతన్యతో ‘బంగార్రాజు’ తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ ఆ మధ్య ఓ తమిళ చిత్రం తీస్తారని వార్తలు వినిపించాయి… మరి ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ ఏమయిందో తెలియదు… నవంబర్ 24న బర్త్ డే జరుపుకుంటున్న కళ్యాణ్ కృష్ణ ఏ సినిమాతో మళ్ళీ జనాన్ని పలకరిస్తారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Air India Flash Sale: విమానంలో వెళ్లాలనుకుంటున్నారా? ఈ ఆఫర్ మీకోసమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *