Boston Brothel Scam:భారత సంతతికి చెందిన క్లీన్ వాటర్ స్టార్టప్ సీఈవో బాజ్‌పేయి.. బోస్టన్‌లోని ఉన్నతస్థాయి వ్యభిచార గృహాలతో ఉన్న సంబంధాలపై అరెస్టు అయ్యారు. ఈ ఘటన ఆ దేశంతోపాటు ఇండియాలో కలకలం రేపింది. ఆయా వ్యభిచార గృహాల లైంగికసేవలు పొందేవారిలో ఈయన పేరు వెల్లడైంది. ఈయన ఒక్కో మహిళతో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి సుమారు 600 డాలర్లు చెల్లించేవారని (రూ.50 వేల వరకు) తెలిసింది. అసలు ఆ మహిళలు ఎవరు? ఎక్కడి వారు? అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
Boston Brothel Scam:అమెరికాలోనే హై ఫ్రోఫైల్ బోస్టన్ బ్రోతల్ స్కాం వ్యవహారం నెట్‌వర్క్ చాలా పెద్దదేనన్న వార్తలు బయటకొస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో సీఈవోలు, లాయర్లు, డాక్టర్లు వంటివారు మాత్రమే ఈ బ్రోతల్ హౌజ్‌లు అనుమతి ఇస్తాయని తెలుస్తున్నది. వారు కోరుకునే మహిళలు కూడా సెలబ్రిటీలు అయితేనే ఇష్టపడుతారట. సినిమాల్లో నటించిన నటులు, హీరోయిన్లు అంటే ఎంత ఖర్చు చేయడానికి విటులు సిద్ధపడతారట. గంటకు రూ.50 వేలకు పైగానే చెల్లించేందుకు వీరు సిద్ధమని తేలుతున్నది.
Boston Brothel Scam:ఈ బోస్టన్ బ్రోతల్ స్కాంలో ఉన్న మహిళలంతా ఆసియాకు చెందిన వారేనని పోలీసుల విచారణలో తేలుతున్నది. వివిధ రకాల వీసాల పేరుతో వారిని అమెరికా రప్పించి, వారితో వ్యభిచారం చేయిస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఆ మహిళల పేర్లు బయటకు వెల్లడించేందుకు అమెరికా ప్రభుత్వంలో నిబంధనలు ఉన్నాయి. సున్నితమైన అంశంగా భావించి మహిళల పేర్లను మాత్రం బయటపెట్టరన్నమాట. విటుల పేర్లు మాత్రం వెల్లడిస్తారు.
Boston Brothel Scam:దీన్నిబట్టి భారత్‌కు చెందిన పలువురు సినీతారలు ఈ బ్రోతల్ ముఠాల ట్రాప్‌లో పడ్డారన్న అనుమానాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. పలువురిపై ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ పలువురు అమెరికాకు వివిధ రూపాల్లో పయనమై వెళ్లి అక్కడ ఇలాంటి బ్రోతల్ పనులు చేసి డబ్బులు సంపాదించుకొని తిరుగుపయనమవుతారన్నమాట.
Boston Brothel Scam:ఇక్కడి నుంచి ఇలాంటి వారిని తరలించే ఒక ముఠా ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ అసలు సేవలందించే వారు ఎవరో తేలితే, ఇండియాలోనూ సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. బ్రోతల్ స్కాంలో గ్రాడియంట్ సీఈవో కూడా ఉన్నట్టు తేలింది.

