Bomb threat:

Bomb threat: ముఖ్య‌మంత్రి స‌హా ప్ర‌ముఖుల‌కు బాంబు బెదిరింపులు

Bomb threat: రాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల‌కు బాంబు బెదిరింపు క‌ల‌క‌లం చెల‌రేగి త‌మిళ‌నాడు రాష్ట్రంలో అల‌జ‌డి నెల‌కొన్న‌ది. మూడు నెల‌ల క్రిత‌మే ఇలాంటి బాంబు బెదిరింపులు రాగా, మ‌రోసారి రావ‌డం క‌ల‌క‌లం రేపింది. గ‌త జూలై నెల‌లోనే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కు బెదిరింపులు రాగా, మ‌ళ్లీ ఈ రోజు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ న‌టి త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. అదే విధంగా బీజేపీ కార్యాల‌యం, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బంగ్లాకు ఈ బాంబు బెదిరింపులు రావ‌డంతో పోలీస్ వ‌ర్గాలు అప్ర‌మ‌త్తమై వెంట‌నే త‌నిఖీలు చేప‌డుతున్నాయి.

Bomb threat: బాంబు బెదిరింపుల‌తో ఆ రాష్ట్రంలో తీవ్ర గంద‌ర‌గోళం చెల‌రేగింది. సీఎం స్టాలిన్, న‌టి త్రికు చెందిన ఇళ్లు, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బంగ్లా, బీజేపీ కార్యాల‌యంలో పోలీస్ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. చెన్నైలోని తేనాంపేట‌లో ఉన్న త్రిష నివాసానికి బాంబు బెదిరింపు స‌మాచారంతో పోలీసులు స్నిఫ‌ర్ డాగ్‌ల‌తో సోదాలు నిర్వ‌హించారు.

Bomb threat: ఇదిలా ఉండ‌గా, ఆగ‌స్టు 15న జెండావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ముందుగా సీఎం స్టాలిన్‌కు బాంబు బెదిరింపు కాల్ రాగా, పోలీసులు దానిపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ కాల్ చేసిన వ్య‌క్తి గ‌ణేశ్‌గా గుర్తించారు. ఈ మేర‌కు అత‌న్ని ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు. ఈ లోగానే మ‌రోసారి సీఎం స్టాలిన్‌కు బాంబు బెదిరింపు కాల్స్ రావ‌డంతో మ‌ళ్లీ అప్ర‌మ‌త్త‌మై భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *