Bomb Threat: కేరళ రాజధానిలోని తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆదివారం ఉదయం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగుడు ఎయిర్‌పోర్టు వెబ్‌సైట్‌కు బాంబు పెట్టినట్లు మెయిల్ పంపించి బెదిరించాడు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
బాంబ్ స్వ్కాడ్ బృందాలను రంగంలోకి దించి, ఎయిర్‌పోర్టు లోని అన్ని ప్రాంతాలు, టెర్మినల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో జరిగిన తనిఖీల్లో ఎటువంటి బాంబులు లభించలేదు. అయినా భద్రతా కారణాల వల్ల మరికొన్ని గంటల పాటు సాయంత్రం వరకు హెచ్చతరమైన జాగ్రత్తలు పాటించనున్నారు.
ఇక ఇది ఒక్కటే కాకుండా, గత కొన్ని రోజులుగా కేరళలో పలు చోట్ల బాంబు బెదిరింపులు వస్తున్నాయి. శనివారం పలు హోటళ్లకు కూడా ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అధికారులు వెంటనే స్పందించి హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా ప్రమాదకర బాంబులు కనపడలేదు.
ఇప్పటికే జిల్లా కలెక్టరేట్‌లు, రెవెన్యూ కార్యాలయాలు, హైకోర్టు వంటి కీలక ప్రాంతాలకు కూడా ఇటువంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. వరుస బెదిరింపు మెయిల్స్ వస్తుండటంతో తిరువనంతపురం సహా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఈ మెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఏ బాంబు లభించలేదు. అయినా భద్రతా చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read: Karregutta: దండకారణ్యంలో మావోయిస్టుల భారీ సొరంగం గుర్తింపు
Bomb Threat: ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదు అని అధికారులు తెలిపారు. “ఇది ఒక అపోహగా ఉండొచ్చు, కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు శాంతంగా ఉండాలి” అని పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. హాస్టళ్లలో, ప్రజా ప్రదేశాల్లో మరింత నిఘా పెంచాలని నిర్ణయించింది.
ఇది తొలిసారి కాదు – గత నెలల్లో కూడా కేరళలో ఇలాంటివే కొన్ని బెదిరింపు ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పటివరకు అవన్నీ నకిలీ బెదిరింపులుగానే మిగిలాయి.