BookMyShow: ఈ ఏడాది విడుదల కాబోతున్న కొన్ని బాలీవుడ్ సినిమాలు బుక్‌మైషోలో భారీ ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. వాటిలో టాప్ 10 సినిమాలు ఏంటో చూద్దాం. హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2, 1.58 లక్షల ఇంట్రెస్ట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. రాజ్‌కుమార్ రావు కొత్త రూపంలో మెరిసే మాలిక్ 86,400 ఇంట్రెస్ట్‌తో రెండో స్థానంలో ఉంది. సాయారా 76,400, నికితా రాయ్ 74,600 ఇంట్రెస్ట్‌తో మూడు, నాలుగు స్థానాల్లో ఆకట్టుకుంటున్నాయి. కలాం 44,100, వెల్‌కమ్ టు ది జంగిల్ 41,800 ఇంట్రెస్ట్‌తో ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి.
Also Read: Jana Nayagan: జననాయగన్ నెక్స్ట్ అప్డేట్ లోడింగ్.. ఎప్పుడంటే?
BookMyShow: ఆంఖోంకి గుస్తాఖియాన్ 30,700, పరమ్ సుందరి 19,000, బాఘీ4 18,900, ధడక్2 14,100 ఇంట్రెస్ట్ లతో టాప్ 10లో చోటు సంపాదించాయి. యాక్షన్, డ్రామా, రొమాన్స్‌తో కూడిన ఈ చిత్రాలు సినీ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. 2025 సంవత్సరం బాలీవుడ్ అభిమానులకు ఉత్కంఠభరిత అనుభవాన్ని అందించనుంది. స్టార్ హీరోలు, కొత్త కథలతో ఈ సినిమాలు ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి!