Bollywood: ఇప్పటికే బాలీవుడ్ మీద దక్షిణాది సినిమాల ఆధిపత్యం స్పష్టంగా కొనసాగుతోంది. దీనిపై కొందురు బాలీవుడ్ బాబులు ఇప్పటికే తమ అక్కసును వెళ్ళగక్కారు. దానికి తోడు దీపావళి కానుకగా విడుదలైన బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అనేయటంతో ఇప్పుడు ఆ ఏడుపు మరింత అధికం కానుంది. బాలీవుడ్ లో ‘సింగం’ ఫ్రాంఛైజ్ లో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణ లభించింది. దాంతో దీపావళి కానుకగా వచ్చిన ‘సింగం ఎగైన్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇందులో మరింత మంది స్టార్స్ ని రోహిత్ శెట్టి తెరమీదరకు తీసుకురావటంతో రీచ్ ఇంకా ఎక్కువగా ఉంటుందని భావించారు. అయితే రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాగా ముద్రపడింది ఈ ఫ్రాంచైజ్ లో తొలి పరాజయాన్ని అందుకుంది.
ఇది కూడా చదవండి: Gautham Ghattamaneni: మహేష్ బాబు కొడుకు వీడియో.. రీల్స్ లో వైరల్
Bollywood: ఈ ఫ్రాంచైజ్ లో కాలు పెట్టిన స్టార్ హీరోలు సైతం ట్రోలింగ్ కి గురవటం బాలీవుడ్ వర్గాలని ఆందోళనకి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే దీపావళికే వచ్చిన మరో ఫ్రాంచైజ్ చిత్రం ‘భూల్ భూలయ్యా3’ సైతం ఇదే దారి. ఈ ఫ్రాంఛైజ్ లోనూ వచ్చిన ముందు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తే ఇప్పుడు ఈ మూడో భాగం తలపోటుకు గురిచేస్తోందంటున్నారు. టాలీవుడ్లో మాత్రం విడులైన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు మంచి టాక్ తో ప్రదర్శితం అవుతున్నాయి. నవంబర్ లోనే అజయ్ దేవగన్ ‘రైడ్2’, అక్షయ్ కుమార్ ‘క్రాక్’, షారూఖ్-కరణ్ జోహార్ సినిమాలు రిలీజ్ కావలసి ఉంది. ఒక వేళ ఈ సినిమాలు నిరాశపరిస్తే డిసెంబర్ 5న రానున్న బన్నీ ‘పుష్ప2’కి తిరుగే ఉండదు. ఏమంటారు..

