Bollywood: కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ ఎందుకో తెలుసా

Bollywood: ప్రఖ్యాత బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన పేరు, ఫోటోలు, కీర్తిని అనుమతి లేకుండా వాణిజ్యపరంగా మరియు అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న వారిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగగా, న్యాయస్థానం ఆమె పర్సనాలిటీ హక్కులను రక్షించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సూచనలు ఇచ్చింది.

జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఐశ్వర్య తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథి వాదిస్తూ, “కొన్ని ఆన్‌లైన్ సంస్థలు, వ్యక్తులు AI సాయంతో ఐశ్వర్య ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ప్రయోజనాల కోసం వాడుతున్నారు. అంతేకాకుండా, ఆమె పేరు, ముఖాన్ని వాడుకుని వ్యాపారం చేస్తున్నారు. ఇది షాకింగ్‌గా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఐశ్వర్య నేషన్ వెల్త్’ అనే సంస్థ తమ లెటర్‌హెడ్‌పై ఆమె ఫోటో ముద్రించి, ఆమెను సంస్థ ఛైర్‌పర్సన్‌గా తప్పుడు రీతిలో చూపించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, మరికొందరు ఆమె ఫోటోలతో టీషర్టులు, వాల్‌పేపర్లు విక్రయిస్తూ హక్కులను ఉల్లంఘిస్తున్నారని వాదించారు

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ప్రతివాదులపై తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సంకేతాలిచ్చింది. అయితే పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కేసు తదుపరి విచారణ వచ్చే సంవత్సరం జనవరి 15న జరగనుంది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇలాంటి సందర్భంలోనే ఈ ఏడాది మే నెలలో నటుడు జాకీ ష్రాఫ్ వేసిన పిటిషన్‌పై కూడా ఢిల్లీ హైకోర్టు అనుకూల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *