Aryaman Deol: ‘యానిమల్’ తో విలన్‌గా మారి సత్తా చాటుతూ క్రేజీ ప్రాజెక్ట్‌లతో జోరు మీదున్నారు బాబీ డియోల్. ప్రస్తుతం ఆయన హిందీలో ‘ఆల్ఫా’, తెలుగులో పవన్ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’, తమిళంలో విజయ్‌తో ‘జన నాయగన్’ చిత్రాల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉండగా, బాబీ డియోల్ తన కుమారుడు ఆర్యమన్‌ను బాలీవుడ్‌లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తన హోమ్ బ్యానర్‌లో ఆర్యమన్ డెబ్యూ చిత్రాన్ని నిర్మించేందుకు బాబీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. కథ ఖరారైన తర్వాత దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను డియోల్ కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బాబీ విలన్‌గా మెప్పిస్తూనే, తన వారసుడి ఎంట్రీకి గ్రాండ్ ప్లాన్ వేస్తూ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆర్యమన్ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

