Ram Charan: జనవరి 10న సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది. తెలుగు తమిళ్, హిందీ, ములాయంలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి శంకర్ దర్శకత్యం వహించగా, రామ్ చరణ్, కియారా అద్వానీ , హీరో హీరోయిన్ లుగా నటించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. కాగా నిన్న హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి ఎస్. ఎస్. రాజమౌళి ముఖ్య అతిధిగా వచ్చారు. అయన మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తర్వాత రాంచరణ్ స్పీచ్ ఇవ్వకుండా సుమ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు.. అందులో రాజమౌళి-మహేష్ బాబు సినిమా ఎపుడు రిలీజ్ అవబోతుంది అని మీరు అనుకుంటున్నారు సుమ అడగగా దానికి సమాధానంగా కరోనా వంటివి రాకపోతే ఒకటిన్నర సంవత్సరం లో రావొచ్చు అని సమాధానం ఇచ్చారు.. రామ్ చరణ్ మాట్లాడుతూ ఉంటె మధ్యలో రాజమౌళి రామ్ చరణ్ మైక్ తీసుకోని బాగానే నేర్పించాను కదా అంటూ ఎద్దేవా చేశారు.