Eatala Rajender: మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పోచారంలోని భూబాధితులు ఎంపీ ఈటల రాజేందర్‌ను ఆశ్రయించారు. ఈమేరకు స్పందించిన ఆయన స్వయంగా ఏకశిలానగర్‌లోని స్థలాల వద్దకు వెళ్లగా అక్కడే ఉన్న ఓ బిల్డర్‌కు సంబంధించిన సిబ్బంది ఒకరిపై ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకున్నారని పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Eatala Rajender: బిల్డర్‌కు సంబంధించిన మనుషులు కొందరు నిత్యం తమను వేధిస్తున్నారని, తమ స్థలాలను ఆక్రమించుకుంటున్నారని, ఎలాంటి పనులు చేసుకోనివ్వడం లేదంటూ పలువురు బాధితులు తనను ఆశ్రయించారని వివాద అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీంతోనే తాను స్వయంగా ఆ స్థలాల వద్దకు వెళ్లానని, అక్కడే ఉన్న సిబ్బందిని వారించే క్రమంలో వివాదం జరిగిందని చెప్పారు.
ఈ విషయంపై పోచారం పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.


