Maharashtra: ఎన్నికల ముందు నేతలు పార్టీలు మారడం మామూలే కానీ మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతిలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇక్కడ టిక్కెట్టు కోసం నేతలు కూటమిలోని ఇతర పార్టీల్లోకి మారుతున్నారు. ఇది ముఖ్యంగా బీజేపీలో కనిపిస్తోంది. షైనా ఎన్‌సీ నుంచి నీలేష్ రాణే వరకు ఈవిధంగానే చేశారు. వీరంతా మహారాష్ట్రలో బిజెపికి బలమైన నాయకులుగా ఉన్నారు, అయితే టిక్కెట్టు పొందడానికి, వారు బిజెపి మిత్రపక్ష పార్టీలోకి జంప్ అయ్యారు.
ఈ అభ్యర్థులు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో లేదా అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో చేరారు. ఈ పరిణామం కూటమిలో అంతర్గతంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జరుగుతున్నట్టు భావిస్తున్నారు.