Ramchander Rao

Ramchander Rao: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు

Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నారపరాజు రామచందర్ రావు ఎంపికపై చివరకు పార్టీ అధిష్ఠానం స్పష్టత ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ పదవికి సంబంధించి అనేక పేర్లు వినిపించాయి. అయితే, పార్టీ అధినాయకత్వం చివరకు రామచందర్ రావు వైపే మొగ్గు చూపింది.

అధికారికంగా ఆయన నామినేషన్ దాఖలు చేయాలంటూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ప్రక్రియను పార్టీ ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు.

ఈ పదవికి ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్ వంటి నేతల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే చివరికి రామచందర్ రావు పేరును ఖరారు చేయడంలో పార్టీ సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ కీలకంగా వ్యవహరించారని సమాచారం.

రామచందర్ రావు రాజకీయ జీవితం

నారపరాజు రామచందర్ రావు 1959 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకుగా ఉన్న ఆయన, ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా పనిచేశారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర తొలి కార్యదర్శిగా కూడా పనిచేశారు.

ఇది కూడా చదవండి: Anchor Swetcha: నా భర్త నిర్దోషి, అమాయకుడు.. తెరపైకి పూర్ణచందర్ భార్య

2009లో శాసనమండలి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడినా, 2015లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018, 2021లో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, పార్టీ పనుల్లో ఆయనకు ఉన్న నిబద్ధత హైకమాండ్‌కి నచ్చినట్టుంది.

తాజాగా, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బీజేపీ ఆయనను నియమించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: కేసీఆర్‌పై కుట్ర కాదు..గోదావరి జలాలపై కుట్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *