Bishnoi Gang: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో అరెస్టయిన నిందితుడు సల్మాన్ ఖాన్ తన హిట్ లిస్ట్‌లో ఉన్నాడని వెల్లడించాడు. అతను బాబా సిద్ధిఖీ కంటే ముందే సల్మాన్‌ను చంపాలని అనుకున్నామనీ, అయితే ఆయన భద్రత కట్టుదిట్టం కావడంతో అతను తన ప్రణాళికను మార్చుకున్నామనీ చెప్పాడు. బాబా సిద్ధిఖీ హత్యకేసులో అరెస్టయిన షూటర్ పోలీసు కస్టడీలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.
ఇది కూడా చదవండి: Jaishankar: స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు
Bishnoi Gang: సిద్ధిఖీ హత్యకు పాల్పడిన నిందితులు పోలీసుల విచారణలో తాము సల్మాన్ ఇంటికి వెళ్లామని చెప్పారు. అయితే, ఈ సమయంలో సల్మాన్ భద్రత చాలా పటిష్టంగా ఉంది. సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కారులో మాత్రమే ఇంటి నుండి బయలుదేరేవాడు. అతని చుట్టూ చాలా మంది గార్డులు ఉండడంతో సల్మాన్‌ను హతమార్చేందుకు వేసిన ప్లాన్ ఫలించలేదు. దీంతో షూటర్లు బాబా సిద్ధిఖీపై దృష్టి సారించి హత్య చేశారు.
అక్టోబర్ 12 రాత్రి సిద్ధిఖీని కాల్చి చంపారు. ఆ సమయంలో ఆయన బాంద్రాలోని తన కుమారుడు జీషన్ కార్యాలయంలో ఉన్నారు. అక్కడి నుంచి బయటకు రాగానే అతడిపైకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి.

