Bird Flu: రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతున్నది. ఇప్పటికే ఏపీలోని వివిధ చోట్ల బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదవగా, అక్కడి పశుసంవర్థక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఈ వ్యాధి సోకిందని తెలిసింది. దీంతో కోళ్ల ఫారాల యజమానులు తగు జాగ్రత్తలు పాటించాలని పశు సంవర్థక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి విస్తరించకుండా తీసుకునే చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Bird Flu: బర్డ్ ఫ్లూ కలకలంతో అప్రమత్తమైన తెలంగాణ.. రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే మూడు చెక్ పోస్టులను, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట వద్ద ఒకటి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలుచోట్ల ఈ చెక్ పోస్టులను అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అటు నుంచి అటే వెనక్కి పంపుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు గ్రామం టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి వస్తున్న కోళ్ల లారీలను జిల్లా వెటర్నరీ అధికారులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు.
Bird Flu: బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు తినే విషయంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచిస్తున్నారు. అధికారులు వచ్చినప్పుడు కోళ్ల పారాల యజమానులు సహకరించాలని సూచిస్తున్నారు. దీంతో పౌల్ట్రీ ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం పడిందని చెప్తున్నారు. అనారోగ్యంతో, వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చి పెట్టాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. వైరస్ సోకిన కోళ్ల తరలింపులో కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Bird Flu: ఇదిలా ఉండగా గత 15 రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవీఎన్ ఇనూయెంజా హెచ్5ఎన్1 అని భోపాల్‌లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తేల్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు ఈ హెచ్5ఎన్1 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పరిసరాల్లో చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.