Bigg Boss 9

Bigg Boss 9: బిగ్ బాస్ వీకెండ్ ఫైర్: నాగార్జున క్లాస్; సంజనకు దొంగతనం శిక్ష

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో నాలుగో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడటంతో, శనివారం నాటి ఎపిసోడ్ (డే 27) ఉత్కంఠ భరితంగా మారింది. హోస్ట్ కింగ్ నాగార్జున ఇంటి సభ్యుల ప్రదర్శనపై ‘వీకెండ్ ఫైర్’ తో సీరియస్ అయ్యారు. ఆయన ఒకవైపు స్టార్స్ ఇస్తూనే, మరోవైపు సభ్యులు చేసిన పొరపాట్లను సూటి ప్రశ్నలు, పదునైన విమర్శలతో ఎత్తి చూపారు.

సంజనకు గట్టి క్లాస్, శిక్ష:
సంజన ఈ వారం వ్యవహరించిన తీరుపై నాగార్జున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘పోపుల సునామీ’ గొడవ, గుడ్లు దొంగతనం వంటి అంశాలపై దృష్టి సారించారు. దొంగతనాన్ని, సరదా కోసం చేసిన ప్రాంక్‌ను వేరు చేయలేకపోయావని మందలించారు. సింపతీ డ్రామా వేశావంటూ విమర్శించి, ఆమె మెడలో “దొంగలున్నారు జాగ్రత్త” అనే బోర్డును వేయించారు. అంతేకాక, హౌస్‌లో ఏ పని చేయాలన్నా సంజన మాత్రమే చేయాలని పనిష్మెంట్ ఇచ్చారు.

పూర్ పర్ఫార్మెన్స్‌కు దెబ్బ:
ఆటలో చురుకుగా పాల్గొనని కంటెస్టెంట్లపై నాగార్జున సీరియస్ అయ్యారు. హరీష్ (మాస్క్ మ్యాన్), ఫ్లోరాల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా వారిద్దరినీ వచ్చే రెండు వారాలకు నేరుగా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. హరీష్‌ను ఉద్దేశించి “మీ బీమ్ బ్యాగ్ కోసం వెళ్లండి, మేము మాట్లాడుకుంటాం” అంటూ గట్టి క్లాస్ తీసుకున్నారు.

Also Read: Narne Nithin: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్!

సుమన్ శెట్టి, ఇమ్ముకు సలహాలు:
సుమన్ శెట్టి ఆటతీరును నాగ్ మెచ్చుకున్నప్పటికీ, “హనుమంతుడికి తన శక్తి తెలియని విధంగా నీకు నీ శక్తి తెలియడం లేదు” అంటూ స్ట్రాటజీలను అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఆయనకు సిల్వర్ స్టార్ ఇచ్చారు. ఆట ఇరగదీస్తున్న ఇమ్మాన్యుయేల్‌కు గోల్డెన్ స్టార్ ఇచ్చి, ఇంకా బాగా ఆడాలంటే తన తల్లికి (మామీ) సంబంధించిన ఎమోషన్స్కు కాస్త దూరంగా ఉండాలని సూచించారు.

తనూజ, శ్రీజపై విమర్శలు:
తనూజ అతిగా ఎమోషనల్ అవడం, బంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమె ఆటను ముంచుతుందని నాగ్ హెచ్చరించారు. “నువ్వు గెలవడానికి వచ్చావా, బంధాలను ఏర్పరచుకోవడానికి వచ్చావా?” అని సూటిగా ప్రశ్నించారు. శ్రీజ ఇంటి సభ్యుల మధ్య గోడలు కట్టడం (మాటలు చెప్పడం) మానేసి, ఆటను మెరుగుపరుచుకోవాలని సూచిస్తూ సిల్వర్ స్టార్ ఇచ్చారు. దివ్య, రీతూ వంటి ఇతర కంటెస్టెంట్లను కూడా వారి వారి తప్పులను ప్రశ్నించారు.

ఎలిమినేషన్పై ఉత్కంఠ:
నాగార్జున పదునైన విశ్లేషణతో, ప్రశ్నించే తీరుతో ఈ వారం ఎపిసోడ్ ఎమోషన్స్, విమర్శలతో నిండిపోయింది. ఈ వారం కామనర్స్ కోటా నుంచి హరీష్ ఎలిమినేట్ అవుతారని సమాచారం ఉన్నప్పటికీ, తుది ఫలితం కోసం ప్రేక్షకులు ఆదివారం ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *