Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా, ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్స్ తమ ఆటను కొనసాగిస్తున్నారు.
రెండో వారంలో నామినేషన్స్
ఈ వారం మొత్తం 7 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. వారిలో మాస్క్ మ్యాన్ హరిత హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్ ఉన్నారు. నామినేషన్స్ ముగిసిన వెంటనే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఓటింగ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.
ఓటింగ్ ట్రెండ్ – బుధవారం రాత్రి వరకు
ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ప్రస్తుతం ఈ వారంలోనూ సుమన్ శెట్టి టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు.
-
సుమన్ శెట్టి – 41% ఓట్లు
-
భరణి శంకర్ – 26% ఓట్లు
-
మాస్క్ మ్యాన్ హరీశ్ – 8% ఓట్లు
-
డీమాన్ పవన్ – 7.5% ఓట్లు
-
ఫ్లోరా సైనీ – 6% ఓట్లు
-
ప్రియా శెట్టి – 5% ఓట్లు
-
మర్యాద మనీశ్ – 3% ఓట్లు
ఎవరు డేంజర్ జోన్‌లో?
ప్రస్తుతం ప్రియా శెట్టి, మనీశ్ మర్యాద తక్కువ ఓట్లు సాధించడంతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. అలాగే గత వారం ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరా సైనీకీ ఈసారి కూడా ఓట్లు అంతగా రావడం లేదు. అంటే ఈ ముగ్గురికే పెద్దగా రిస్క్ ఉన్నట్టే.
మార్పులకే అవకాశముంది
ఇంకా రెండు రోజుల ఓటింగ్ టైమ్ మిగిలి ఉండటంతో చివరి నిమిషంలో పరిస్థితులు మారే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్యాటర్న్‌ను బట్టి చూస్తే మర్యాద మనీశ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
👉 మరి వీకెండ్ ఎపిసోడ్‌లో ఎవరు బయటకు వెళతారు? ఎవరు గేమ్‌లో సేఫ్ అవుతారు? అనేది ప్రేక్షకుల ఓట్లపైనే ఆధారపడి ఉంటుంది.