Bigg Boss 9: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారంలో హౌస్‌లో గొడవలు, మొదటి వారం నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలైనప్పటికీ, ఈ వారం టాస్కులు, వాగ్వాదాలతో హీట్ పెరిగింది. శనివారం విడుదలైన ప్రోమోలో నాగార్జున హౌస్‌మేట్స్‌కు గట్టి క్లాస్ పీకారు. అంతేకాదు, ఊహించని ట్విస్ట్‌తో డిమాన్ పవన్ కెప్టెన్సీని రద్దు చేసి అందరినీ షాక్‌కు గురిచేశారు.
రెండో వారం కెప్టెన్సీ టాస్కులో టెనెంట్స్, ఓనర్స్ గట్టిగా పోటీపడ్డారు. సంచాలక్‌గా ఉన్న రీతూ చౌదరి, తన సన్నిహితుడు డిమాన్ పవన్‌ను కెప్టెన్‌గా చేయాలని ముందే ప్లాన్ చేసింది. టాస్క్ సమయంలో రీతూ, పవన్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందని హౌస్మేట్స్ ఆరోపించారు. ఈ విషయం శనివారం ప్రోమోలో నాగార్జున బయటపెట్టారు. రీతూ, పవన్ మాట్లాడిన వీడియోను హౌస్‌లో ప్లే చేసి, వారి ప్లాన్‌ను అందరి ముందు బహిర్గతం చేశారు.
Also Read: Katrina Kaif-Vicky Kaushal: తల్లితండ్రులు కాబోతున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్?
నాగార్జున షాకింగ్ నిర్ణయం
ప్రోమోలో నాగార్జున, రీతూ చౌదరి ప్లాన్‌ను ప్రశ్నించారు. స్టాప్ అన్న తర్వాత కూడా భరణిని ఎలిమినేట్ చేశావ్. తనూజ, సంజన చెప్పినా నీవు వాళ్ల మాటను పట్టించుకోలేదు అని రీతూను నిలదీశారు. డిమాన్ పవన్ కెప్టెన్‌గా ఎంపికైన తీరు సరైంది కాదని హౌస్మేట్స్ భావించారు. ఈ ప్రక్రియ సరైనది కాదని ఎంతమంది అనుకుంటున్నారని నాగ్ అడిగినప్పుడు, రీతూ, పవన్ మినహా అందరూ చేతులు ఎత్తారు. దీంతో, నాగార్జున డిమాన్ పవన్ కెప్టెన్సీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎలిమినేషన్ ఉత్కంఠ
రెండో వారం ఎలిమినేషన్ దగ్గరపడుతుండగా, హౌస్‌లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. గొడవలు, టాస్కులతో పాటు, ట్రయాంగిల్ స్టోరీ కూడా హౌస్‌లో హైలైట్‌గా మారింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. నాగార్జున ప్రోమోలో ఈ రోజు ఎవరికి రంగు పడుతుందో చూద్దాం అని చెప్పడంతో టెన్షన్ మరింత పెరిగింది.