Bigg Boss 8 Telugu Winner: బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పాత్రలు అనేకం ఉన్నాయి. ఇందులో గౌతమ్ కృష్ణా, నిఖిల్, ప్రేమ, నబీల్, అవినాష్ లు టాప్ ఫైవ్ గా నిలిచారు. 105 రోజులు అన్ని టాస్కులు ఆడి ఆడియన్స్ మనసులు గెలుచుకున్న ఈ టాప్ ఫైవ్ లో ఒకరు మాత్రమే టైటిల్ తీసుకెళ్తారు.
అయితే, ఈ సీజన్ ఫైనల్ దాకా వచ్చినంత వరకు గౌతమ్ కృష్ణా అత్యధిక వోట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నట్టు సమాచారం. గౌతమ్ బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన క్షణాలు అనేకం ఉన్నాయి. మొదట్లో గౌతమ్ సరిగ్గా ఆడలేకపోయాడు. ఒకానొక దశలో ఎలిమినేట్ అయ్యాడు. కానీ సీన్ కట్ చేస్తే కొన్ని వారాల్లోనే హీరో అయ్యాడు. తన వ్యక్తిత్వంతో, హౌస్ లో చూపిన పరస్పర సంబంధాల వలన ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నాడు. అతని స్ట్రాటజీ, నిజాయితీ, సమతుల్య నిర్ణయాలు అతనికి ఎంతో మద్ధతు ఇచ్చాయి.
ఇది కూడా చదవండి: Mohan babu: మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్
Bigg Boss 8 Telugu Winner: ప్రస్తుతం, గౌతమ్ కృష్ణా బిగ్‌బాస్ 8 తెలుగు విజేతగా ఉండటానికి దాదాపు అంచనా పడుతోంది. ఆయన ప్రవర్తన, పోటీదారులతో మంచి బంధం, అలాగే టాస్క్‌లలో నిలబడిన ప్రతిభతో చివరి వరకూ ప్రేక్షకులను ఆకర్షించాడు. గౌతమ్ కృష్ణా విజేతగా నిలబడటానికి చాలా కారణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జోరుగా నడుస్తుంది. ఆయనకు ఫైనల్‌లో అత్యధిక వోట్లు వచ్చాయని, ఆయనను ఫాన్సీ కూడా చాలా ఆదరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

