Bigg Boss 9: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 లో మరో ఎలిమినేషన్ పూర్తయింది. ఈ వారం హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి, తన ఫైర్ బ్రాండ్ స్వభావంతో హౌస్‌ను అట్టుడికించిన దువ్వాడ మాధురి కేవలం మూడు వారాల్లోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. సోషల్ మీడియా పోలింగ్ ప్రకారం గౌరవ్ ఎలిమినేట్ అవుతారని అందరూ భావించినప్పటికీ, ఊహించని విధంగా మాధురి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
రచ్చతో మొదలు.. మారిన ఆట తీరు
మొదటి రోజు నుంచే గొడవలు, వాదనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మాధురి, హోస్ట్ నాగార్జున హెచ్చరికల తర్వాత తన మాట తీరును, ఆట తీరును మార్చుకుంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతున్న సమయంలో ఆమె ఎలిమినేట్ కావడం గమనార్హం. మాధురి బయటకు వచ్చే సమయానికి, తన భర్త శ్రీనివాస్ పుట్టినరోజు (నవంబర్ 4) ఉండటం వలన ఆ సమయంలో ఆయన పక్కన ఉండడం తనకు సంతోషంగా ఉందని స్టేజ్‌పై తెలిపింది. హౌస్‌లో ఉన్న మూడు వారాలకు గానూ ఆమె సుమారు రూ. 1 లక్ష 20 వేలు పారితోషికం అందుకున్నట్లు సమాచారం.
Also Read: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T.’ షూటింగ్ కంప్లీట్.!
వెళ్లిపోతూ సంచలన వ్యాఖ్యలు
స్టేజ్‌పైకి వచ్చిన మాధురి హౌస్‌మేట్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తనతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తనూజ తనలాగే స్వీట్‌గా, నిజాయితీగా ఆడుతోందని కన్నీళ్లతో ప్రశంసించింది. తన ఎలిమినేషన్‌కు తనూజ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి మాధురి కూడా భావోద్వేగానికి లోనైంది.
జెన్యూన్ ప్లేయర్స్: కళ్యాణ్ చాలా జెన్యూన్గా, ఎలాంటి మాస్క్ లేకుండా ఆడుతున్నాడని, డీమాన్ పవన్ చాలా స్వీట్ అండ్ క్యూట్ అని పొగిడింది.
మాస్క్ ధరించిన వ్యక్తి: అయితే, భరణికి హౌస్‌లో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పింది. అతను “100 శాతం ఫేక్”, మాస్క్‌తో ఉంటాడు, అందరినీ వెన్నుపోటు పొడుస్తాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
గేమ్ ఫోకస్: దివ్య గురించి మాట్లాడుతూ, ఆమె తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్ పైనే ఎక్కువ దృష్టి పెడుతుందని, వారి ఆటను చెడగొట్టడానికి ప్రయత్నిస్తుందని ముల్లు ఇచ్చింది.
ఈ వారం నామినేషన్లలో మాధురితో పాటు గౌరవ్, సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్ ఉన్నారు. ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం గౌరవ్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో గౌరవ్ అవుట్ అవుతాడని అంతా భావించినా, బిగ్ బాస్ నిర్వాహకులు మాధురిని ఎలిమినేట్ చేయడం ప్రేక్షకులకు మింగుడుపడలేదు.
ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియ, ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ, రమ్య మోక్ష ఎలిమినేట్ కాగా, గత వారం భరణి రీఎంట్రీ ఇచ్చారు.

