Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu: హౌస్ నుండి సుమన్ శెట్టి అవుట్.. 14 వారాలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా చివరి అంకానికి చేరుకుంది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించడంతో హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో ఊహించినట్టుగానే కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు.

సుమన్ శెట్టి ఎలిమినేషన్ హౌస్‌మేట్స్‌ను ముఖ్యంగా భరణిని తీవ్రంగా కలచివేసింది. సుమన్ బయటకు వెళ్తున్న సమయంలో భరణి భావోద్వేగానికి గురై, “బయటకు రాగానే మనిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం.. కలిసి షూటింగ్ చేస్తున్నాం” అంటూ కంటతడి పెట్టడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుమన్ శెట్టిని ఉద్దేశిస్తూ ఇమ్మాన్యుయేల్ “సుమన్ శెట్టి ప్రభంజనం” అంటూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. చివరకు, సుమన్ తన పాపులర్ డైలాగ్ “అధ్యక్షా వెళ్లొస్తా” అని చెప్పి, “మా భరణి అన్నను జాగ్రత్తగా చూసుకోండి” అంటూ హౌస్‌మేట్స్‌ను రిక్వెస్ట్ చేసి బయటకు వచ్చేశాడు.

మంచితనమే సుమన్ బలం: బ్యూటిఫుల్ జర్నీ!

స్టేజ్ పైకి వచ్చిన తర్వాత, ఫైనల్ వీక్‌కు ముందు ఎలిమినేట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారని నాగ్ అడగ్గా… “హ్యాపీగానే ఉంది సార్, ఒక్కవారం ఉంటే టాప్ 5కి వెళ్లేవాడ్ని” అని సుమన్ నవ్వుతూ బదులిచ్చాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి ప్రయాణానికి సంబంధించిన జర్నీ వీడియోను ప్రదర్శించారు. హౌస్‌లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా, ఎవరితోనూ గొడవ పడకుండా దాదాపు 14 వారాలు మచ్చలేని ఆట ఆడాడు సుమన్. అతని ఆట తీరు, ప్రవర్తన, ఎమోషన్స్‌తో కూడిన వీడియోను చూసి నాగార్జున సైతం “బ్యూటిఫుల్ జర్నీ” అంటూ ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: Murder: పహాడీ షరీఫ్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?

అనంతరం నాగ్ ‘హౌస్‌లో బొగ్గు ఎవరు, బంగారం ఎవరు?’ అని అడగ్గా… “బొగ్గు ఎవరూ లేరు సార్.. అందరూ బంగారాలే” అని సుమన్ చెప్పడం మరోసారి అతని మంచితనాన్ని చాటింది.

బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెకండ్ సెలబ్రిటీ!

సుమన్ శెట్టి జర్నీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెలబ్రెటీల జాబితాలో సుమన్ శెట్టి చేరినట్లు సమాచారం. అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, సుమన్‌కు రోజుకు రూ.45 వేల రెమ్యునరేషన్ దక్కింది. 14 వారాలకు గానూ సుమన్ శెట్టి దాదాపు రూ.44 లక్షలు అందుకున్నట్టు టాక్. ఇది నిజమైతే, బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న రెండో సెలబ్రిటీ సుమన్ శెట్టే అవుతారు.

ఇక, డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఆదివారం ఎపిసోడ్‌లో భరణి కూడా హౌస్ నుంచి బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఫినాలే ముందు వీరిద్దరి ఎలిమినేషన్ అభిమానులను నిరాశకు గురిచేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *