Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ సీజన్ 9లో ఈ వారం కూడా గందరగోళం, ఊహించని మలుపులు కొనసాగాయి. ఫైర్ బ్రాండ్‌గా హౌస్‌లో పేరు తెచ్చుకున్న దివ్య ఎలిమినేషన్ కావలిసి ఉండగా చివరి నిమిషంలో సురక్షితమైంది. దీనికి కారణం హౌస్‌మేట్స్ మధ్య బలపడుతున్న ‘బాండింగ్’ దాని పర్యవసానంగా జరిగిన పవర్ అస్త్ర వినియోగమే.
ఈ వారం ఎలిమినేషన్‌కు దివ్య నామినేట్ అయినప్పటికీ, ఇమ్మాన్యుల్ తనకున్న పవర్ అస్త్రాన్ని ఉపయోగించడంతో బిగ్‌బాస్ ఈ వారం ఎలిమినేషన్‌ను రద్దు చేశారు.
పలువురి అభిప్రాయం ప్రకారం, ఈ పవర్ అస్త్ర వినియోగం దివ్య లేదా నామినేట్ అయిన సంజనతో ఇమ్మాన్యుల్‌కు ఉన్న బలమైన ‘బాండింగ్’ వల్లనే జరిగిందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం కారణంగా హౌస్‌లో ఉన్న కళ్యాణ్, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యూల్, రీతూ, భరణి, పవన్, సంజన్, దివ్య తమ ప్రయాణాన్ని కొనసాగించనున్నారు.
‘బాండింగ్’ రాజకీయాలు: మిత్రులుగా మారిన శత్రువులు
బిగ్‌బాస్ సీజన్ 9లో ‘బాండింగ్’ అనే అంశం బలమైన ముద్ర వేసింది. గతంలో తనూజ, భరణి (నాన్న అని పిలవడం ద్వారా) దివ్య మధ్య బలమైన బంధం ఉండేది. అయితే, ఈ బాండింగ్‌లు ఇప్పుడిప్పుడే పాలిటిక్స్‌గా రూపాంతరం చెందుతున్నాయి.
భరణితో తనూజ క్లోజ్‌గా ఉండటంపై దివ్య అసంతృప్తి చెందడంతో వీరిద్దరి మధ్య తరచుగా వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. 11వ వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో, దివ్య మొదటగా తనూజ పేరు చెప్పి ఆమెను ఎలిమినేట్ చేయడంతో వీరి విభేదాలు మరింత బహిరంగమయ్యాయి.
ఇది కూడా చదవండి: Movie Piracy: ఐబొమ్మ ని ఆపితే పైరసీ ఆగదు.. సినిమా రిలీజ్ అయిన వెంటనే సైట్ లోకి
దివ్య మొదలుపెట్టిన తనూజ నామినేషన్‌కు భరణి, ఇమ్మాన్యుల్, సంజన కూడా తోడయ్యారు. ఈ గ్రూపు పాలిటిక్స్ హౌస్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రీతూ చౌదరి కెప్టెన్సీ: తనూజ ఎత్తుకు పైఎత్తు
కెప్టెన్సీ టాస్క్‌లో ఎలిమినేషన్ ప్రమాదం ఎదురైన తనూజకు బిగ్‌బాస్ ఒక మంచి అవకాశం ఇచ్చారు. దీనిని తెలివిగా ఉపయోగించుకున్న తనూజ, తనకు వ్యతిరేకంగా పనిచేసిన గ్రూపుకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది.
గ్రూపు విభజన టాస్క్‌లో, తనూజ తన మిత్రురాలైన రీతూ చౌదరికి అనుకూలంగా, తన పాత మిత్రులను విడదీస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది:
-
టీమ్ 1 (ప్రత్యర్థి గ్రూపు): దివ్య, భరణి, ఇమ్మాన్యూల్, సంజన
-
టీమ్ 2 (మిత్ర గ్రూపు): రీతూ చౌదరి, పవన్, సుమన్ శెట్టి, కళ్యాణ్
ఈ నిర్ణయం ఫలితంగా, చివరి నిమిషం వరకూ వచ్చి కెప్టెన్సీని కోల్పోతున్న రీతూ చౌదరి ఈసారి విజేతగా నిలిచి కెప్టెన్ అయింది. రీతూకు పవన్, కళ్యాణ్, తనూజతో ఉన్న పటిష్టమైన బాండింగ్ ఈ కెప్టెన్సీ సాధించడంలో కీలక పాత్ర పోషించిందని స్పష్టమవుతోంది.
బిగ్‌బాస్ హౌస్‌లో స్నేహ బంధాలు బలమైన టీమ్‌లను ఏర్పరుస్తున్నాయి, కానీ అదే సమయంలో ఆ బంధాలు విచ్ఛిన్నమై ప్రత్యర్థులకు లాభం చేకూరుస్తున్నాయి. ఇక ముందు ఈ ‘బాండింగ్’ పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి.

