Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో వాతావరణం మారిపోయింది. కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండే హౌస్ రణరంగంగా మారింది. ముఖ్యంగా దివ్వెల మాధురి ఎంట్రీతో హౌస్‌లో హీట్ మరింతగా పెరిగింది. తాజాగా విడుదలైన ఎపిసోడ్ ప్రోమోలో మాధురి ప్రవర్తన బిగ్ బాస్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. కెప్టెన్ పవన్ కళ్యాణ్‌తో ఘర్షణకు దిగిన మాధురి, దివ్యతో కూడా వాగ్వాదం జరిపింది.
వంటగదిలో మొదలైన హంగామా
ఫుడ్ మానిటర్‌గా ఉన్న దివ్యతో పాటు కెప్టెన్ పవన్ కళ్యాణ్ వంట షెడ్యూల్ గురించి చర్చిస్తుండగా, మాధురి ఆలస్యంగా కుకింగ్ డ్యూటీకి రావడంతో ఇబ్బంది మొదలైంది. కళ్యాణ్ మర్యాదపూర్వకంగా “మాధురి గారూ, కూర్చోండి మాట్లాడాలి” అని అడగగా, ఆమె “ఏ కూర్చోకపోతే చెప్పవా?” అంటూ దురుసుగా స్పందించింది. ఈ సమాధానం పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొట్టింది. “మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది” అంటూ ఆయన కౌంటర్ ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: Karur Stampede: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కరూర్‌లో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు
ఎమోషనల్ అయిన మాధురి
వాదన తర్వాత వంటింట్లో కూడా ఇద్దరి మధ్య గొడవ మళ్లీ చెలరేగింది. దివ్య కూడా కళ్యాణ్ పక్షాన నిలిచి, “ఇంత ఆలస్యంగా వస్తే ఇంట్లో అందరూ పస్తులుండాలా?” అంటూ మాధురిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తగువుతో మాధురి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంటిని, కుటుంబాన్ని గుర్తుచేసుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది. తనూజ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కొత్త డ్రామా
ఈ సీజన్లో ఇప్పటికే కొందరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో, ఆదివారం ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో రమ్య మోక్ష (చిట్టి పికిల్స్ ఫేమ్), టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దివ్వెల మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్, గౌరవ్ గుప్తా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Sabja Seeds: సబ్జా గింజలు వల్ల అద్భుత ప్రయోజనాలు..!
వారి రాకతో బిగ్ బాస్ హౌస్ రసవత్తరంగా మారింది. కానీ మాధురి ఎంట్రీతోనే డ్రామా మొదలవ్వడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. చాలామంది “ఇది కేవలం ఆరంభం మాత్రమే, మాధురి హౌస్‌కి కొత్త ట్విస్ట్ తీసుకువస్తుంది” అని కామెంట్ చేస్తున్నారు.
ప్రేక్షకుల స్పందన
ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు హీట్ చర్చలు జరుపుతున్నారు. కొందరు “మాధురి ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తోంది” అంటుండగా, మరికొందరు “అసలు మాధురి ఎక్కడా వెనక్కి తగ్గదనిపిస్తోంది” అంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే, బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కొత్త లెవల్‌కి చేరింది. మాధురి ఎఫెక్ట్‌తో రాబోయే ఎపిసోడ్లు మరింత హీట్‌గా, ఎమోషన్‌తో నిండిపోవడం ఖాయం.