Supreme Court: తెలంగాణ ప్రభుత్వంకి సుప్రీమ్ కోర్ట్ లో ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ని రాదు చేయాలి అంటూ వేసిన పిటీషన్ ని కొట్టివేస్తూ సుప్రీమ్ కోర్ట్ తిరుపుని ఇచ్చింది. 2022 లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 2024 లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ చట్ట విరుద్దమంటూ అంతే కాకుండా 2024 గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మైన్స్ ని కూడా వాయిదా వేయాలి అని తెలంగాణ హై కోర్ట్ లో పిటీషన్ వేయగా దాని కొట్టివేసింది. దింతో హైకోర్ట్ ని సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్ట్ లో అభ్యర్థులు పిటీషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. పిటీషన్ వేసినవారిలో మెయిన్స్ పాస్ అయినవారు లేనందున. వాయిదా అవసరం లేదని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరం అని వెల్లడించింది.

