Gulshan Kumar biopic: టీ సీరిస్ అధినేత గుల్షన్ కుమార్ ను 1997 ఆగస్ట్ 12న కొంతమంది జుహూ ప్రాంతంలోని ఓ దేవాలయం దగ్గర కాల్చి చంపేశారు. ఆ హత్య కేసులు సినిమా రంగానికి చెందిన పలువురిని విచారించిన అధికారులు కుట్రదారు రఫూఫ్ ను దోషిగా నిర్ధారించారు. ఇందులో సంగీత దర్శకుడు నదీమ్ అక్తర్ ను అనుమానించారు. అలానే టిప్స్ అధినేత రమేశ్ తౌరానిని అరెస్ట్ చేసి విచారించారు. ఇప్పుడు టీ సీరిస్ అధినేతగా ఉన్న గుల్షన్ కుమార్ తనయుడు భూషణ్ కుమార్… తన తండ్రి బయోపిక్ ను తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో గుల్షన్ పాత్రను పోషించడానికి ఆమీర్ ఖాన్ సైతం అంగీకరించారు. అయితే… తాము తయారు చేసిన స్క్రిప్ట్ కు తన తల్లి నుండి అనుమతి లభించలేదని, తాము ఒక కోణంలో ఈ సినిమా కథను తయారు చేస్తే… తన తల్లి మరో విధంగా ఉండాలని కోరుకుంటున్నారని భూషణ్ తెలిపాడు. ఆమె కోరిక మేరకు స్క్రిప్ట్ ను రీ-రైటింగ్ చేయిస్తున్నామని, అది కాగానే సినిమా సెట్స్ పైకి వెళుతుందని అన్నారు. మరి గుల్షన్ కుమార్ జీవితంలో ఎన్నో ఊహకందని మలుపులు ఉన్నాయి. వాటిలో వేటిని తెరపై చూపిస్తారనేది వేచి చూడాలి.

