DELHI: ప్రస్తుతం దాయాది దేశమైన పాకిస్థాన్ భారత్ తీసుకున్న కఠిన వాణిజ్య నిర్ణయాలతో తీవ్రంగా ఒత్తిడిలో ఉంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్థాన్ పట్ల వాణిజ్య పరంగా గట్టిగా వ్యవహరించింది.
భారత్ ప్రభుత్వం 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్, పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు బాగా తగ్గించింది. పాక్ నుంచి దిగుమతులపై 200 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. అంతేకాకుండా, పాకిస్థాన్‌కు ఇప్పటి వరకు ఇచ్చిన “మోస్ట్ ఫేవర్డ్ నేషన్” హోదాను కూడా రద్దు చేసింది. ఈ చర్యల వల్ల పాకిస్థాన్ నుంచి దిగుమతులు తగ్గుతూ వచ్చాయి.
తాజా గణాంకాలు ఏమంటున్నాయంటే…
అధికారిక సమాచారం ప్రకారం, 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య కాలంలో భారత్, పాకిస్థాన్ నుంచి కేవలం 4.2 లక్షల అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులనే దిగుమతి చేసుకుంది. ఈ వస్తువుల్లో పండ్లు, నిర్మాణ సామాగ్రి, పత్తి వంటి వాటితో పాటు ఇతర అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ ప్రభుత్వం పాక్ నుంచి ఎలాంటి వస్తువును దిగుమతి చేసుకోవద్దని ఆర్డర్ పాస్ చేసింది. దీంతో పాక్ కు భారీ దెబ్బ అనే చెప్పాలి.
భారత్‌కి పాక్ నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే ఉత్పత్తులు:
సిమెంట్ , ఇతర నిర్మాణ సామాగ్రి
పత్తి , యార్న్ , సిల్క్ వేస్ట్
ఖర్జూరం , మామిడి పండ్లు , ఉల్లి , టమాటా , డ్రైఫ్రూట్స్
డిప్సమ్ , రాక్ సాల్ట్ , లెదర్ , ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగించే కెమికల్స్
క్రికెట్ బ్యాట్లు , గ్లౌజులు , బాల్స్