James Cameron: తన విజన్ కి తగ్గ టెక్నాలజీ అందుబాటులో లేదని.. దాన్ని కనిపెట్టి మరీ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్.. ఆయన ఇమాజినేషన్ బియాండ్ ఉంటుందసలు.. ఆగస్టు 16న 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారాయన. ప్రస్తుతం అవతార్ ఫ్రాంచైజీ మూవీస్ తో బిజీగా ఉన్న జేమ్స్.. ఈ మధ్యే మరో కొత్త సినిమా కూడా అనౌన్స్ చేశారు.
Also Read: Elvish Yadav: బిగ్‌బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు
అవతార్ సిరీస్ లో వస్తున్న అవతార్ 3 – ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఇప్పుడు ‘అవతార్’కి సంబంధం లేని మరో క్రేజీ మూవీ అనౌన్స్ చేసి, సర్ ప్రైజ్ ఇచ్చారు జేమ్స్ కామెరూన్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, హిరోషిమా అణు దాడి ఆధారంగా దీని కథా నేపథ్యం ఉండనుంది. టైటానిక్ తర్వాత కామెరూన్‌కి బాగా ఇష్టమైన, పవర్ ఫుల్ స్టోరీ ఇదేనని స్వయంగా ఆయనే చెప్పడం విశేషం. అవతార్ 3 డిసెంబర్ 19న రిలీజ్ కానుంది.