Bengaluru Stampede:కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు చిన్నిస్వామి క్రికెట్ స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఆ నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. స్థానిక పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ ప్రేక్షకాభిమానులను ఆహ్వానించిందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.
Bengaluru Stampede:అయితే తన నివేదికలోని అంశాలను రహస్యంగా ఉంచాలన్న ప్రభుత్వ వినతిని కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. గోప్యతకు చట్టపరమైన అంశాలేవీ లేవని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ ఇటీవలే తన నివేదికను ఆ ప్రభుత్వానికి అందజేసింది. దానిని తాజాగా రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. ఆ నివేదికలో విరాట్ కోహ్లీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం.
Bengaluru Stampede:ఐపీఎల్ పోటీల్లో ఆర్సీబీ జట్టు 18 ఏళ్ల తర్వాత విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకున్నది. ఆ ఆనందంతో జూన్ 3న ఆర్సీబీ యాజమాన్యం పోలీసులను సంప్రదించింది. విజయోత్సవ వేడుక గురించి సమాచారం మాత్రమే ఇచ్చారు. కానీ ఎలాంటి అనుమతులు కోరుతూ ఎలాంటి అభ్యర్థనలు చేసుకోలేదు. కానీ, ఇలాంటి అంశాల్లో కనీసం ఏడు రోజుల ముందు దరఖాస్తు సమర్పించి, అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.. అని ప్రభుత్వం తన నివేదికనలో పేర్కొన్నది.
Bengaluru Stampede:అదే రోజు వేడుకల కోసం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థనను తిరస్కరించామని, చివరి వరకూ ఆర్సీబీ విజయంపై డైలమా నెలకొనడంతో, ఒకవేళ గెలుపొందినా, వచ్చే వారి సంఖ్యపై ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. విజయం పొందిన అనంతరం పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ విక్టరీ విజయోత్సవ సభపై తన ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.. అని సర్కార్ తన నివేదికలో తెలిపింది. విరాట్ కోహ్లీ కూడా తనకు బెంగళూరు ప్రజలతో విజయాన్ని పంచుకోవాలని ఉన్నదని పేర్కొంటూ మరో పోస్టు వెలిసింది.
Bengaluru Stampede:ఈ మేరకు జరిగిన విజయోత్సవ వేడుకల్లో స్టేడియం సామర్థ్యమైన 3లక్షల మందికి మంచి హాజరయ్యారు. స్టేడియం చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల మేర జనం రద్దీతో ఆ ప్రాంతం జన సముద్రాన్ని తలపించింది. దీంతో 1, 2, 21 గేట్ల నుంచి జనం అధిక సంఖ్యలో తుసుకొని లోనికి వచ్చే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోగా, సుమారు 50 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు.