Bengaluru Techie

Bengaluru Techie: క్షణికావేశంలో భార్యను చంపేశాడు.. రాత్రంతా శవంతో మాట్లాడుతూ కూచున్నాడు!

Bengaluru Techie: పని ఒత్తిడి.. ఆర్థిక సమస్యలు భార్యా భర్తల మధ్య కీచులాటలకు దరి తీయడం సహజం. కాస్త ఓపిక పడితే అన్ని విషయాలు సర్దుకుపోతాయి. కానీ.. అంత సహనం ఇప్పటి యువతలో ఉండడం లేదు. చిన్న కారణాలకే విడిపోతున్న జంటలు చాలా కనిపిస్తున్నాయి. అలాగే.. తగాదా పడిన తరువాత తమ జీవిత భాగస్వామిని హత్యచేస్తున్న సంఘటనలూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన పని అదే. భార్యతో వచ్చిన చిన్న తగాదాతో సహనం కోల్పోయి ఆమెను హత్య చేశాడు. తరువాత రాత్రంతా ఆమె శవంతో మాట్లాడుతూ కూచున్నాడు. ఈ విభ్రాంతికర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాకేష్ కడేకర్ (35) తన భార్య గౌరీ సంబరేకర్ (32)తో కలిసి హులిమావు ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆ దంపతుల మధ్య జరిగిన ఒక వాదన విషాదంగా మారింది. 2025 మార్చి 26 రాత్రి పని విషయంలో జరిగిన వివాదం కారణంగా తన భార్య గౌరీ అనిల్ సాంబ్రేకర్‌ను హత్య చేసి, ఆ తర్వాత మృతదేహం పక్కనే కూర్చుని రాత్రంతా మాట్లాడాడు. ఈ విషయాన్ని రాకేష్ రాజేంద్ర కేటేకర్ పోలీసుల ముందు అంగీకరించడం దిగ్భ్రాంతిని కలిగించింది.

నిరుద్యోగం: తరచుగా ఘర్షణ

మహారాష్ట్రలో నివసించే రాకేష్ ఒక నెల క్రితం బెంగళూరుకు బదిలీ అయ్యాడు. యు హిటాచి సిస్టమ్స్ ఇండియాలో సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా ఇంటి నుండి పనిచేస్తున్నాడు. భర్తతో పాటు బెంగళూరుకు వెళ్లే క్రమంలో గౌరి మహారాష్ట్రలో ఒక ప్రైవేట్ కంపెనీలో తానూ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది.

ఇది కూడా చదవండి: Ration Card updates: రేష‌న్ ల‌బ్ధిదారుల‌కు గుడ్ న్యూస్‌.. ఏప్రిల్ నుంచే ఇవ‌న్నీ అమ‌లు

తరువాత, బెంగళూరులో ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పటికీ, ఆమెకు సరైన జాబ్ దొరకలేదు. దీంతో ఆమె తన భర్తను విమర్శించి, మహారాష్ట్రకు తిరిగి రమ్మని కోరింది. అయితే, అతను దీనికి అంగీకరించలేదు. దీని కారణంగా వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి.

కోపంలో హత్య
ఈ నేపథ్యంలో మార్చి 26న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఒక సమయంలో సహనం క్లొపోయి కోపంతో రాకేష్ తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక పెద్ద సూట్‌కేస్‌లో దాచిపెట్టాడు. దానికంటే ముందు గౌరి మరణించిన తర్వాత, రాకేష్ మృతదేహం పక్కనే కూర్చుని రాత్రంతా దానితో మాట్లాడాడు. “నాతో ఎందుకు గొడవ పడ్డావు? ఉద్యోగం రాలేదని నన్ను ఎందుకు నిందించావు? నేను బెంగళూరుకు రాకూడదని ఎందుకు బాధపడ్డావు?” అంటూ తన వాదనను వినిపిస్తూనే ఉన్నానని చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యగా చిత్రీకరించాలని..
తరువాత, రాకేష్ తన మామగారిని సంప్రదించి గౌరి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో షాక్ కు గురైన గౌరి తల్లిదండ్రులు వెంటనే బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా, గౌరి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచిపెట్టి ఉంచినట్టు గుర్తించాడు. ఇదిలా ఉండగా.. రాకేష్ కూడా ఫెంటానిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు అతనిని రక్షించి వెంటనే రక్షించి ఆసుపత్రికి పంపారు. అతను ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

ప్రస్తుతం పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రాకేష్ కడేకర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *