Bengaluru

Bengaluru: బైకు సైడ్‌ మిర్రర్‌కు తాకిందని.. కారుతో యువకుడిని గుద్ది చంపిన దంపతులు

Bengaluru: బెంగళూరులో జరిగిన ఓ చిన్న వివాదం దారుణంగా మారింది. సైడ్‌ మిర్రర్‌కు బైక్‌ తాకిందనే చిన్న కారణంతో ఓ యువకుడిని దంపతులు వెంబడించి, కారుతో ఢీకొట్టి చంపిన ఘటన నగరాన్ని కుదిపేసింది. పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అక్టోబర్‌ 22 అర్ధరాత్రి సమయంలో దర్శన్‌ అనే యువకుడు తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి శ్రీరామ లేఅవుట్‌ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో పక్కగా వస్తున్న మనోజ్‌కుమార్‌, ఆయన భార్య ఆర్తి శర్మ కారులో ఉన్నారు. ఆ కారు సైడ్‌ మిర్రర్‌ను బైక్‌ తాకడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో దర్శన్‌ తన బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆగ్రహానికి లోనైన దంపతులు తమ కారులో దర్శన్‌ బైక్‌ను రెండు కిలోమీటర్ల మేర వెంబడించి, వెనక నుంచి ఢీకొట్టారు.

Also Read: Viral Video: 3 ఏళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన మైనర్ బాలుడు

ఈ ప్రమాదంలో దర్శన్‌ తీవ్రంగా గాయపడగా, అతని స్నేహితుడు వరుణ్‌ కూడా గాయాలతో కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతున్న దర్శన్‌ ప్రాణాలు కోల్పోయాడు. వరుణ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలంలో కారుకు చెందిన కొన్ని విడిభాగాలు పడిపోయాయి. వాటిని తిరిగి తీసుకెళ్లేందుకు మనోజ్‌, ఆర్తి మాస్కులు వేసుకుని తిరిగి అక్కడికి వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కదలికలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఆధారాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి జేపీనగర్‌ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.

మొదట ప్రమాద మరణంగా భావించిన ఈ కేసును, సీసీటీవీ వీడియో పరిశీలన తర్వాత పోలీసులు హత్య కేసుగా మలిచారు. మనోజ్‌కుమార్‌, ఆర్తి శర్మలపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక చిన్న సంఘటననే పెద్ద దారుణంగా మారింది.  ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీ, చిన్న గొడవలు సాధారణమే అయినా, వాటిని హింసకు దారితీయడం మానవత్వానికి మచ్చ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *