Roasted flax seeds: అవిసె గింజలు ఆరోగ్యంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇది పోషకాల నిలయం. దీన్ని ఆహారంలో ఒక టీస్పూన్ చేర్చుకోవడం వల్ల 37 కేలరీలు లభిస్తాయి. అవంతేకాకుండా ఫైబర్, ప్రోటీన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని వేయించి ఆహారంలో కలిపితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాల్చిన అవిసె గింజల వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కాల్చిన అవిసె గింజలు తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు
జుట్టు – చర్మం మెరుగ్గా :
కాల్చిన అవిసె గింజలు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనిలోని ఒమేగా కొవ్వు ఆమ్లాలు తగినంత పోషకాహారాన్ని అందించడంతో పాటు ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించడం వల్లజుట్టు కుదుళ్లు, చర్మ కణాల నాణ్యతను మెరుగుపడతాయి.
శక్తి బూస్టర్:
చాలా మంది ఉదయం నిద్రలేవగానే అలసిపోయినట్లు భావిస్తారు. అందువల్ల కాల్చిన అవిసె గింజలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. కాల్చిన అవిసె గింజల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీనిని మెత్తగా చేసి బ్రెడ్ లేదా శాండ్‌విచ్‌లలో తినవచ్చు.
మంచి నిద్ర:
కాల్చిన అవిసె గింజలను కొద్దిగా పాలలో కలిపి లేదా పొడి చేసి పాలతో తాగడం మరింత మంచిది. ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని త్రాగాలి. ఇది సెరోటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడం ద్వారా నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025కి ముందు గుజరాత్ టైటాన్స్ ఓనర్ మార్పు..!
మెదడు శక్తిని పెంచుతుంది:
అవిసెలను అన్నం లేదా స్నాక్స్‌తో కాల్చి తింటే ఇంకా మంచిది. వేయించిన అవిసె గింజలు తినడం వల్ల మెదడు శక్తి పెరుగుతుంది. అవిసె గింజల్లో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు శక్తిని వేగంగా పెంచడంలో సహాయపడతాయి. అవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మలబద్ధకం నుండి రిలీఫ్ :
మలబద్ధకంతో బాధపడేవారు అధిక ఫైబర్ కలిగిన కాల్చిన అవిసె గింజలను తినడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.ౌ
కొలెస్ట్రాల్ :
మీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అవిసె గింజలను వేయించి ఉదయం ఒక టేబుల్ స్పూన్, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల LDL స్థాయిలు తగ్గుతాయి.
బరువు తగ్గుదల: బరువు తగ్గాలనుకునేవారు అవిసెలను వేయించి భోజనం తర్వాత తినాలి. ఈ విత్తనాలలోని ప్రోటీన్ ఆకలిని తగ్గించి జీవక్రియను వేగవంతం చేస్తుంది.

