Beauty Tips: బీట్‌రూట్ లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. ఇంట్లో మీ ముఖాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి మరింత ఉపయోగపడుతుంది. బీట్‌రూట్ తినడం వలన శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాకుండా, ఇది శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా ముఖ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
బీట్‌రూట్ ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న సూర్యరశ్మి మచ్చలు తొలగిపోయి చర్మ రంగు మెరుగుపడుతుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇంట్లో మీ చర్మానికి బీట్‌రూట్‌ను ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు.
బీట్‌రూట్‌ను బియ్యం పిండితో కలిపి, రెండింటినీ బాగా రుబ్బుకుని పేస్ట్ లా తయారు చేసుకోండి. తర్వాత 10 లేదా 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోండి. బీట్‌రూట్, బియ్యం పిండి రెండూ ముఖం నుండి మురికిని తొలగిస్తాయి. నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: Delhi Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం అయితే.. కేజ్రీవాల్ కు ఇరకాటం తప్పదు
Beauty Tips: ఒక బీట్‌రూట్, రెండు కప్పుల బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్లు పాలు, రెండు కప్పుల నీరు తీసుకుని పేస్ట్ గా తయారుచేసుకోవాలి. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల రంగు మెరుగుపడుతుంది. నల్లటి మచ్చలు, మొటిమలు, ముడతలు, నల్లటి వలయాలు నుండి అన్నీ మాయమవుతాయి. అలాగే, చర్మం ఆరోగ్యంగా మారుతుంది. తద్వారా ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
15 రోజులకు ఒకసారి ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది. ఇది రంధ్రాలను శుభ్రపరచడంతో పాటు డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్ నుండి వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది. చర్మానికి హాని కలిగించే ఈ వస్తువులను నెలకు రెండుసార్లు తొలగిస్తే, చర్మం మరింత ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.