మార్చి నెలలో, వివిధ రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసివేయబడతాయి. 5 ఆదివారాలు, రెండవ-నాల్గవ శనివారాలు కాకుండా, వివిధ ప్రదేశాలలో బ్యాంకులు 7 రోజులు క్లోజ్ ఉంటాయి. వచ్చే నెలలో మార్చి 14న హోలీ – మార్చి 31న ఈద్-ఉల్-ఫితర్ వంటి రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. వీటితో పాటు స్థానిక సెలవులు కొన్ని రాష్ట్రాల్లో ఉంటాయి.
అటువంటి పరిస్థితిలో, మీకు వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఈ సెలవు దినాలలో తప్ప మీరు బ్యాంకుకు వెళ్ళవచ్చు.
మార్చి నెలలో బ్యాంకు సెలవుల జాబితా ఇదే
2 మార్చి-ఆదివారం – ప్రతిచోటా
7 మార్చి –చాప్చర్ కుట్ ఫెస్టివల్ –ఐజ్వాల్
8 మార్చి – రెండవ శనివారం – ప్రతిచోటా
9 మార్చి – ఆదివారం – ప్రతిచోటా
మార్చి 13 – భోగి – డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువనంతపురం
మార్చి 14 – హోలీ – ప్రతిచోటా
మార్చి 15 – ఒసాంగ్ రెండవ రోజు – అగర్తలా, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నా
మార్చి 16 – ఆదివారం – ప్రతిచోటా
మార్చి 22 – నాల్గవ శనివారం – ప్రతిచోటా
మార్చి 23 – ఆదివారం – ప్రతిచోటా
మార్చి 27 – షబ్-ఎ-ఖాదర్ – జమ్మూ -శ్రీనగర్
మార్చి 28 – జమాత్ ఉల్ విదా – జమ్మూ – శ్రీనగర్
మార్చి 30 – ఆదివారం – ప్రతిచోటా
మార్చి 31 – ఈద్ ఉల్ ఫితర్ – ప్రతిచోటా
ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా..
బ్యాంకు సెలవులు ఉన్నప్పటికీ, మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ మరియు ATM ద్వారా డబ్బు లావాదేవీలు చేయవచ్చు లేదా ఇతర పనులు చేసుకోవచ్చు. ఈ సౌకర్యాలు బ్యాంకు సెలవుల వల్ల ప్రభావితం కావు.
మార్చిలో 12 రోజులు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఉండదు..
మార్చి 2025 లో 12 రోజులు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఉండదు. శని, ఆదివారాల్లో 10 రోజుల పాటు ట్రేడింగ్ ఉండదు. ఇది కాకుండా, మార్చి 14న హోలీ, మార్చి 31న ఈద్-ఉల్-ఫితర్ నాడు కూడా స్టాక్ మార్కెట్ మూసిఉంటుంది.

