Bangladesh:బంగ్లాదేశ్ దేశంలో విమాన ప్రమాదంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 27కు చేరుకున్నది. ఆ దేశ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం (జూలై 21) ఢాకాలోని ఓ స్కూలు భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అప్పటికప్పటికీ 20 మంది చనిపోయారు. వారిలో ఒకరు పైలట్ కాగా, మరో ఇద్దరు ఉపాధ్యాయులు, 17 మంది విద్యార్థులు మృతిచెందారు. మరో 171 మంది గాయాలపాలయ్యారు.
Bangladesh:క్షతగాత్రులు బంగ్లాదేశ్ మిలిటరీ ఆసుపత్రితో పాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఏడుగురు చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకా వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. శిక్షణ విమానం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 27కు చేరింది..వారిలో 24 మంది విద్యార్థులే.. అని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్ మహమ్మద్ యూనస్, సలహాదారులు సైదుర్ రెహమాన్ తెలిపారు.

