Safari World Zoo: బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ సఫారీ వరల్డ్ జూలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరవై ఏళ్లుగా అక్కడ ఉద్యోగం చేస్తున్న జియన్ రంగ్‌ఖరాసమీ అనే కేర్‌టేకర్‌పై సింహాలు దాడి చేసి చంపేశాయి.
సాధారణంగా జూలో సింహాలకు ఆహారం పెట్టే బాధ్యతలు నిర్వర్తించే జియన్, బుధవారం ఎన్‌క్లోజర్‌లో వాహనం నుంచి దిగగానే అపశృతి జరిగింది. ఒక్కసారిగా సింహాలు ఆయనపై దాడి చేశాయి. దాదాపు 15 నిమిషాలపాటు దాడి కొనసాగింది. పర్యాటకులు వాహనాల హారన్‌లు కొడుతూ, అరుస్తూ వాటిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి సహాయకులు ఆయనను లాగి బయటకు తీసుకువచ్చినా.. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
పర్యాటకుల ముందే.. జూకీపర్‌ను చంపి పీక్కుతిన్న సింహాలు
జియన్ రంగ ఖరాసమీ అనే వ్యక్తి 20 ఏళ్లుగా బ్యాంకాక్‌లో ఓపెన్ ఎయిర్ జూలో సింహాల కేర్‌కేటర్‌గా పని చేస్తున్నాడు.
అతడి పై దాడి చేసి శరీరంలోని కొంత భాగాన్ని పీక్కుతిన్నా సింహాలు
అక్కడే ఉన్న పర్యాటకులు తమ కార్ హారన్‌లు… pic.twitter.com/YkLffaZ7Dh
— s5news (@s5newsoffical) September 11, 2025
ఈ ఘటనపై సఫారీ వరల్డ్ అధికారులు స్పందిస్తూ, గత 40 ఏళ్లలో ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి అని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
సింహాలు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి?
సింహాలు సాధారణంగా జింకలు, జీబ్రాలు, అడవి దున్నలు వంటి జంతువులనే వేటాడుతాయి. మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. అయితే:
-
గాయపడిన లేదా వయసు మీద పడిన సింహాలు వేటాడలేకపోయే పరిస్థితిలో మనుషులపై దాడి చేస్తాయి.
-
అడవుల్లో ఆహారం తగ్గిపోయినా ప్రత్యామ్నాయంగా పశువులు, కొన్నిసార్లు మనుషులపై దాడి చేస్తాయి.
-
ఒకసారి సింహం మనిషిని వేటాడితే, ఆ ప్రవర్తన అలవాటు అవుతుంది. కొన్నిసార్లు తన పిల్లలకీ అదే పద్ధతి నేర్పుతుంది.
చరిత్రలో కూడా మనుషులపై సింహాల దాడుల ఉదాహరణలు ఉన్నాయి.
-
Tsavo Man-Eaters (1898): కెన్యాలో రెండు సింహాలు 135 మంది రైల్వే కార్మికులను చంపినట్లు రికార్డులు ఉన్నాయి.
-
Njombe Man-Eaters (టాంజానియా): తరతరాలుగా మనుషులపై వేటాడిన సింహాల గురించి ఆధారాలు ఉన్నాయి.