Balakrishna

Balakrishna: బాలయ్య బర్త్‌డే బోనంజా: ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్‌తో మాస్ జాతర!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా! ఒకవైపు ‘అఖండ 2’ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మరోవైపు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్! బాలయ్య మాస్ హిట్ చిత్రాల్లో ఒకటైన ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. జూన్ 10న బాలయ్య బర్త్‌డే సందర్భంగా జూన్ 7 నుంచి థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం, ఫ్యాన్స్‌లో జోష్ నింపడం ఖాయం. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, మణిశర్మ సంగీత సౌరభంతో రూపొందిన ఈ మూవీ, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ వెండితెరపై ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందన్నది ఆసక్తికరం. అఖండ 2 నుంచి ట్రీట్‌లతో పాటు ఈ రీ-రిలీజ్, బాలయ్య ఫ్యాన్స్‌కు పండగలా ఉండనుంది. మరి, ఈ మాస్ జాతరలో బాలయ్య మ్యాజిక్ ఎలా చూపిస్తుందో వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *